12 April, 2026 | 11:23 PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫుడ్‌బాల్ జట్టుకు భద్రాచలం వాసి ఎంపిక

03-11-2025 12:15 AM

భద్రాచలం, నవంబర్ 2,(విజయక్రాంతి):భద్రాచల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దొడ్డిపట్ల కోటేష్  కుమారుడు దొడ్డిపట్ల పునీత్ జిల్లా అండర్ 14 ఫుడ్ బాల్ టీమ్ కు ఎంపిక కావడం పట్ల భద్రాచలంలోని పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 400 మంది క్రీడాకారులు ఈ ఎంపికలో పాల్గొనగా, తుదిజెట్టుగా 16 మందిని సెలెక్టర్లు ఎంపిక చేయడం జరిగింది.

ఎంపికైన 16 మందిలో భద్రాచలం ప్రాంతం నుంచి దొడ్డిపట్ల పునీత్ ఎంపిక కావటం భద్రాచలం వాసులు, క్రీడాకారులు క్రీడా అభిమానులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. వికారాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి రాష్ట్రస్థాయి ఫుడ్ బాల్ పోటీలలో దొడ్డిపట్ల పునీత్ మంచి ప్రతిభ కనబరచాలని భద్రాచల ప్రాంతవాసులందరూ కోరుకుంటున్నారు.