03-11-2025 12:14:05 AM
ఇల్లెందు, నవంబర్ 2, (విజయక్రాంతి): మణుగూరు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం పై దాడిని నిరసించిన నాయకులను ఇల్లెం దు లో పోలీసులు ఆదివారం ముంద స్తు అరెస్ట్ చేశారు. బిఆర్‌ఎస్ మణుగూరు కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసిన విధానాన్ని నిరసిస్తూ ఇల్లందు బిఆర్‌ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన తెలిపి దాడిని ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎస్.రంగనాథ్, ఎస్ కె అబ్దుల్ నబీ, పట్టణ ఉపాధ్యక్షులు ఎండి.జబ్బర్, లలిత్ కుమార్ పాసి, మూలగుండ్ల ఉపేందర్ రావు లను పోలీసులు అరెస్ట్ చేశారు.