30 August, 2026 | 12:44 PM

నగరంలో పలుచోట్ల భారీ వర్షం

20-05-2024 02:19 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (విజయక్రాంతి) : నగరంలో పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, జేఎన్టీయూ, మూసాపేట్, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్‌పల్లి ప్రాంతాల్లోని రోడ్లన్ని జలమయమయ్యాయి. సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి రోడ్లపై మోకాలి లోతు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు సకాలంలో స్పందించి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు. అలాగే పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో విరిగిన చెట్లు, కొమ్మలను జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించారు. నగరంలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.