30 August, 2026 | 2:21 PM

కారులో చెలరేగిన మంటలు

30-08-2026 01:50 PM

కారు పూర్తిగా దగ్ధం  

చేగుంట ఆగస్ట్ 30,విజయక్రాంతి: చేగుంట మండల పరిధిలోని 44 జాతీయ రహదారిపై(National Highway 44) కారులో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది ,చేగుంట పోలీస్ ల వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా,బిక్నూర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న , టీ ఎస్ 11యు 5137 గల కారు,  జాతీయ రహదారి పై గల రెడ్డిపల్లి బ్రిడ్జి వద్ద, రాగానే, కారు నుండి ఒకసారిగా మంటలు వ్యాపించాయి, మంటలను గుర్తించిన కారు డ్రైవర్ అప్రమత్తమై, వెంటనే వాహనాన్ని పక్కుకు నిలిపి వేయడంతో పాటు, కారులో ఉన్న ప్రయాణికులను  బయటకు దింపారు, దీంతో పెను ప్రమాదం తప్పింది అయితే మంటలు భారీగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది,ఇది గమనించిన స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు వచ్చి మంటలను ఆర్పడంతో అంతా ఊపిరిపించుకున్నారు ,