భారత్ దుర్గ సేవ గణేష్ మండలి అన్నదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) ః కామారెడ్డి భారత్ దుర్గా సేవ గణేష్ మండలి ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి చేద్దాలతో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు. అత్యంత నిష్ఠతో పూజలు నిర్వహిస్తూ అందరూ ఐక్యత భావంతో కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు మాజీ సి డి సి చైర్మన్ అశోక్ రెడ్డి తాజా మాజీ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్, కోయల్కర్ కన్నయ్య, ఇసాక్ షేరు ,భూక్యరాజు, ఆఫీస్ ఇన్చార్జి లక్క పత్ని గంగాధర్, లక్ష్మణ్ యాదవ్, శంకర్, నర్సింగ్, కిరణ్, వార్డు పెద్దలు కొడిశాల ప్రభాకర్, కోడిశాల గంగాధర్, సంజీవ్, గీత బృందం తదితరులు పాల్గొన్నారు.






