ఓరల్ కలరా వ్యాక్సిన్.. భారత్ బయోటెక్.. విడుదల
27-08-2024 02:52 PM
హైదరాబాద్: ఓరల్ కలరా వ్యాక్సిన్ ను భారత్ బయేటెక్ ఇ:టర్నేషనల్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. హిల్ కాల్ పేరుతో ఈ వ్యాక్సిన్ ను తీసుకొచ్చినట్లు వెల్లడి్ంచింది. 2023 మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా 8,24,479 మందికి కలరా సోకగా.. 5,900 మంది మరణించారు. సుమారు 31 దేశాల్లో కలరా తో బాధ పడుతున్నవారు, మరణాల సంఖ్య తీవ్రంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యాక్సిన్ కొరత కలరా సోకినవారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓరల్ వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.






