కవిత బెయిల్ విషయంపై 'ఎక్స్'లో స్పందించిన కేటీఆర్
27-08-2024 04:03 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ విషయంపై 'ఎక్స్'లో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయం గెలిచిందని 'ఎక్స్'లో కేటీఆర్ పేర్కొన్నారు. ఉపశమనం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుకు వక్రభాష్యం చెప్పడం సమంజసం కాదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు, సీజేఐ సుమోటోగా స్వీకరించాలన్నారు. కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజురు చేసింది. మార్చి 15వ తేదీన ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.






