ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు
27-08-2024 01:48 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ కు 3 ప్రధానమైన కారణాలు చెప్పిన సుప్రీంకోర్టు సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది, ఈడీ దర్యాప్తు పూర్తిచేసింది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మసనం వెల్లడించింది. ఆమెను ఒక మహిళా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సూచించింది. కవితను ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈడీ, సీబీఐ కేసుల్లో 5 నెలలకు పైగా ఆమె తీహార్ జైలులో ఉన్నారు.






