7 April, 2026 | 3:07 AM

ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

07-04-2026 12:35 AM

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 6 (విజయక్రాంతి):సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి  299వ డివిజన్  భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కావేరి శ్రీధర్ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరించారు. గుండ్లపోచంపల్లి మినీ ట్యాంక్ బండ్, కండ్లకోయ్య అర్కల గూడా, మైసమ్మగూడ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి ఎదిగిన తీరు అద్భుతం అన్నారు.

1980 ఏప్రిల్ 6న ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ నేడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని విక్రం రెడ్డి స్పష్టం చేశారు. అంత్యోదయ సిద్ధాంతంతో సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పార్టీ సిద్ధాంతకర్తలు శ్యాం ప్రసాద్ ముఖర్జీ,పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని దేశ హితమే పరమావధిగా సాగుతున్న ప్రయాణంలో భాగస్వాములై కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి. జిల్లా కిసాన్ మోర్చా నాయకులు సముద్రాల  కృష్ణ గౌడ్.మాజీ మున్సిపల్ బిజెపి కౌన్సిలర్‌లు అమరం సరస్వతి మోహన్ రెడ్డి.దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్.మాజీ బిజెపి ఎంపీటీసీ లు గడీల విష్ణువర్ధన్ రెడ్డి.ఉషీగారి శ్రీనివాస్ ముదిరాజ్. పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ జైతువాల కిషన్.డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శులు జైతువాల కృష్ణ.చింతల పూడి రామారావు.బిజెపి నాయకులు బట్టి కాడి నవనీత.

చెంచల సురేష్.యంబ అర్జున్ బాబు.సత్యనారాయణ.వెంకటేష్ గౌడ్.మధుసూదన్ రెడ్డి.బట్టికాడి విక్రమ్. నవీన్. సిహెచ్ నరసింహారావు.రాజు ముదిరాజ్.వీరారెడ్డి.అభిలాష్.అరుణ్.శ్రీకాంత్.శ్రావణ్ వివిధ బిజెపి పార్టీ విభాగాలకు చెందిన అధ్యక్షులు కార్యదర్శులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.