త్యాగాల సీపీఐ (పార్టీ)కి విరాళాలిచ్చి ఆదుకోండి
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 6: ప్రజా పోరాటాలతో వందేళ్లు పూర్తి చేసుకున్న త్యాగాల సీపీఐ పార్టీకి విరాళాలిచ్చి ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి అన్నారు. ఇంటింటికి సీపీఐ కార్యక్రమంలో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండల కమిటీ ఆధర్యంలో మండల కేంద్రంలో సోమవారం ధర్మభిక్షం విగ్రహానికి పూలమాల వేసి నివాళిలర్పించారు. అనంతరం సామూహిక విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి హాజరై మాట్లాడుతూ..
భారతదేశంలో పిడిత ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ.. వందేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ సీపీఐ మాత్రమేనన్నారు. ప్రజల తరఫున పోరాటాలు చేసే పార్టీకి ప్రజలే తమకు తోచిన సహాయం చేసి.. పార్టీని కాపాడుకోవాలని ప్రజా ఉద్యమల్ని మరింత ఉధృతం చేయాలని కోరారు. ఈ నెల 10 వరకు అబ్దుల్లాపూర్‌మెట్ మండలలోని అన్నీ ప్రాంతాల్లో ఈ విరాళాల కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
అధిక సంఖ్యలోప్రజలు పాల్గొని విజవంతం చేయాలని కోరారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. కార్మికుల, కర్షకుల పక్షాన, పిడిత ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తామన్నారు. అబ్దుల్లాపూర్ సర్పంచ్, ఉప సర్పంచ్ పాల్గొని తమ వంత విరాళం అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పబ్బతి లక్ష్మణ్, మండల కార్యదర్శి అజ్మీర హరిసింగ్ నాయక్, మండల నాయకులు కేతరాజు నరసింహ, యేషాల నరసింహ, పొన్నాల యాదగిరి, అరుణ, నవనీత, ఈశ్వర్, మధు, సుజాత, నిరంజన్ దేవమ్మ, రాములు, రమేష్, యాదగిరి, మధు, వినోద్ నాయక్, వీరేష్, సాయిలు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




