లాల్ దర్వాజ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన భట్టి
28-07-2024 01:15 PM
హైదరాబాద్: లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్తాలను సమర్పించారు. లాల్ దర్వాజ ఆలయ కమిటీ, ఎండోమెంట్ అధికారులు డిప్యూటీ సీఎం భట్టికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం భట్టి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్చించి దర్శనం చేసుకున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజ బోనాల ఉత్సవాల్లో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు.






