calender_icon.png 15 November, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో వరద బీభత్సం.. ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి

28-07-2024 01:50:28 PM

న్యూఢిల్లీ: గత వారం రోజులుగా ఎదతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఢిల్లిలో  వరద బీభత్సంలో విషాదం చోటు చేసుకుంది. ఓల్డ్ రాజిందర్ నగర్ లో   సివిల్స్ కోచింగ్  సెంటర్ బేస్ మెంట్ లోకి వరదనీరు చేరింది. దీంతో వరదనీటిలో మునిగి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతిచెందారు. లైబ్రరీలో చదువుకుంటుండగా ఒక్కసారిగా వదరనీరు రావడంతో ఇద్దరు యువతులు, ఒక యువకుడు చనిపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని నీటీలో చిక్కుకున్న పలువురిని రక్షించి, ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశాయి. ఈ ఘటనపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ కు మంత్రి అతిశీ ఆదేశాలు జారీ చేశారు.