28-07-2024 12:39:04 PM
హైదరాబాద్ : స్వర్గీయ ఎస్ జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్ లో కుటుంబ సభ్యులు,పలువురు మంత్రులతో కలిసి నివాళి అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తిలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యహ్నం 2 గంటలకు హెలికాప్టర్ లో బయల్దేరుతారు. సాయంత్రం 5.30 నిమిషాల వరకు కల్వకుర్తిలో పర్యటించి, బీఎస్ఎస్ఎల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొంటారు. అలాగే శ్రీశైలం హైవేలోని కొట్ర జంక్షన్ లో కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.