‘భట్టి’ గంపెడాశలు
కరీంనగర్, మార్చి 19 (విజయ క్రాంతి): రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులపై ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశలు పెంచుకున్నారు. అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో రాష్ట్ర మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో ఉమ్మడి జిల్లాకు సం బంధించిన పలు పెండింగ్, కొత్త ప్రాజెక్టులకు వచ్చే నిధులపై సర్వత్రా ఆసక్తి నెలకొం ది.
మానేరు రివర్ ఫ్రెంట్, ముత్యంపేట షుగర్స్ ఫ్యాక్టరీ, పత్తిపాక రిజర్వాయర్ కు ఎంత కేటాయిస్తారన్నది చూడాలి. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఆగిపోయిన అప్ప టి సి ఎం హామీ పథకం నిధులు వస్తాయా, కొత్త కేటాయింపులు ఉంటాయా చూడాలి. శాతవాహన విశ్వవిద్యాలయం లా జాలేజీ, హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజి లకు నిధులు కేటాయించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
మల్లాపూర్ మండలం ము త్యంపేట గ్రామం నిజాంషుగర్స్ బకాయిలు మొత్తం 250 కోట్ల రూపాయలు ఉన్నాయి. తొలుత 43 కోట్లు, తర్వాత అది 192 కోట్ల రూపాయలకు చేరింది. మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే ఇవ్వ నుంది. ఫార్చున్ కన్సెల్టెన్సీ ప్రతినిధులను పిలిచి ముత్యంపేట ఫ్యాక్టరీ రిపేరు చేయాలా? కొత్తది ఇన్స్టాల్ చేయాలా? అన్న విషయాలపై నివేదిక ఇవ్వమంది. మరమ్మతులకు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని..
ఒకవేళ నడిపినా పదేపదే మరమ్మతుల కారణంగా నష్టాలు వస్తాయని చెప్పింది. లాభాలు రావాలంటే కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని నివేదిక ఇచ్చింది. ఈ బడ్జెట్లో దీనిపై ప్రభుత్వం ఏంనిర్ణయం తీసు కుంటుపడుతోందని తీసుకోనుందని ఉత్కంఠ గా మారింది.
ఉమ్మడి జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు భూములకు నీరు అందించి స్థిరీకరణ చేసేందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తి పాక వద్ద ఒక రిజర్వాయర్ను నిర్మించాలని ప్రతిపాదించారు. దానికి బడ్జెట్లో చోటు ఇస్తారని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. ఇందు కు సంబంధించి డీపీఆర్ కు ఆదేశించారు. సుమారు 2 వేల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రకటన ఉంటుందో చూడాలి.
రేకుర్తి భూములపై నిషేధిత జాబితా తొలగేనా..?
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తపల్లి మండలం రేకుర్తిలో సుమారు 125 సర్వే నెంబర్లలో 550 ఎకరాలను నిషేధ జాబితాలో చేర్చారు. ఈ భూముల్లో సుమారు 3 వేల ఇండ్లు, 6 వేల వరకు ప్లాట్లు ఉంటాయని అంచనా. రేకుర్తి భూములను నిషేధ జాబితా నుండి తొలగించాలని కోరుతూ కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
అలాగే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిషేధిత జాబితాను తొలగించాలని కరీంనగర్ నుంచి సచివాలయం వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఈ సమావేశాల్లో రేకుర్తి భూముల వ్యవహారంపై చర్చించి సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
నేతన్నలో ఆశలు
ఎన్నిపథకాలు అమలు చేసినా కార్మికుడు కార్మికుడుగానే మిగిలిపోతున్నాడు. కార్మికుడే యజమాని అయితే వారి బతుకులు బాగుపడుతాయన్న ఉద్ధేశ్యంతో నాడు కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 350కోట్ల వ్యయంతో వర్కర్ టూ ఓనర్ పథకం ప్రవేశపెట్టారు. అందుకు అప్పారెల్ పార్కులో నిర్మించారు. మొదటి దశలో 1140 మందికి సబ్సిడీపై , సాంచాలు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం మారడంతో పెండింగ్లో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చివర్కర్టూ ఓనర్ పథకాన్ని ప్రారంభించి తమను యజమానులను చేస్తుందన్న ఆశతో నేతన్నలు ఉన్నారు.




