రక్షాబంధన్ రోజే భోగి!
శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కి స్తున్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. ‘ఏ బ్లడ్ ఫెస్ట్’ అనేది ట్యాగ్‌లైన్. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథా నాయికలుగా నటిస్తున్నారు. 1960ల కాలంలో ఉత్తర తెలంగాణ సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతోందీ చిత్రం. ప్రస్తుతం హైదరా బాద్‌లో భారీ సెట్‌పై ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్సులు చిత్రీక రిస్తున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లను డిజైన్ చేశారు.
ఇదిలావుండగా, తాజాగా బుధవారం మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. కథానాయకుడు శర్వా ఫస్ట్‌లుక్‌ను సైతం రిలీజ్ చేశారు. ఈ సినిమాను రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో శర్వా ఇప్పటివరకు కనిపించని రగ్గడ్, ఫెరోషస్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు.
ముఖ్యంగా శర్వా తొలిసారి గుబురు గడ్డంతో కనిపిస్తుండటం అందరినీ సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ సంపత్ నంది సోషల్‌మీడియాలో పంచుకుంటూ “అతను పునర్జన్మ పొందాడు.. నా ‘గంగా’గా..” అనే వ్యాఖ్యను జోడించటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: కిషోర్‌కుమార్ అరోకియా; ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె; నిర్మాత: కేకే రాధామోహన్; రచన, దర్శకత్వం: సంపత్ నంది.




