మిథికల్ థ్రిల్లర్ వృషకర్మ
నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఈ చిత్రాన్ని ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ గురించి అప్‌డేట్ ఇచ్చారు.
మార్చి 5న విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. ఈ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగచైతన్య లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పాత్ర కోసం నాగచైతన్య మ్యాసీవ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు.
రా, రగ్గడ్ లుక్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని, అనేక థ్రిల్లింగ్ స్టంట్స్‌ను స్వయంగా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బీ లోక్‌నాథ్; సినిమాటోగ్రఫీ: రాగుల్ డీ హెరియన్; ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర తంగాల; ఎడిటర్: నవీన్ నూలి; నిర్మాతలు: బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ బీ; దర్శకత్వం: కార్తీక్ దండు.




