26 August, 2026 | 7:26 PM

షెడ్డు నిర్మాణానికి భూమి పూజ

26-08-2026 06:35 PM

బేల,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో బుధవారం బాజీరావు బాబా ఆలయ సమీపంలో రూ.5 లక్షల ఎస్‌డీఎఫ్‌ నిధులతో చేపట్టనున్న షెడ్డు నిర్మాణ పనులకు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే సుఖసంతోషాలతో జీవించడంతో పాటు అందరితో సఖ్యతగా, కలిసిమెలిసి ఉంటారని ఆయన అన్నారు.

షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డిని, గ్రామ సర్పంచ్ భూపతిరెడ్డి, ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సామ నర్సారెడ్డి లను గ్రామస్తులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు వినోద్, సతీష్, మంచికంటి ఉషన్న, సునీల్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ మేకల జితేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ నవగరే, రవీందర్ పటేల్, సునీల్, సుధాకర్, మారుతి, లస్మన్న, విలాస్, దయాకర్ పటేల్, దేవన్న, ప్రవీణ్, నందు తదితరులు పాల్గొన్నారు.