ఎస్ఎఫ్ఐ నూతన మండల కమిటీ ఎన్నిక
ములకలపల్లి, ఆగస్టు 26 (విజయక్రాంతి): మండల పరిధిలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ నందు బుధవారం ఎస్ఎఫ్ఐ మండల మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలో విద్యా రంగ సమస్యలపై పలు అంశాలపై తీర్మానాలు ఆమోదించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులుగా శనగవరపు సంజయ్, మండల ప్రధాన కార్యదర్శిగా ముదిగొండ ప్రశాంత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వీరితో పాటు మరో 15 మంది మండల కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు శనగవరపు సంజయ్, ముదిగొండ ప్రశాంత్ లు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యా రంగ సమస్యల పై నిరంతరం పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పారు. మండలంలోని గంజాయి వాంటి మాదక ద్రవ్యాలను నిర్మూలించడానికి విద్యార్థులను చైతన్య పరుస్తామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నెలకొన్న విద్యారంగ సమస్యల పై ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసు,మనోహర్,వంశీ, మనోజ్,శరత్, శేఖర్, జీవన్,సాంబ, తదితరులు పాల్గొన్నారు.






