26 August, 2026 | 8:43 PM

గంజాయి కేసులో నలుగురు అరెస్ట్

26-08-2026 07:12 PM

ఆర్మూర్,(విజయ క్రాంతి): ఆర్మూర్ నగరంలోని పెర్కిట్ ఏరియాకు చెందిన నలుగురు యువకులు గంజాయి తాగడానికి అలవాటు పడడమే కాకుండా జర్నలిస్టు కాలనీకి చెందిన సమీర్ అనే వ్యక్తి నుండి గంజాయిని కొనుగోలు చేసి ఆర్మూర్ లోని యువతకు చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో అమ్ముతూ నలుగురు యువకులు పట్టుబడినట్లు అర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. పెర్కిట్ కు చెందిన షేక్ సోఫియాన్, మహమ్మద్ అజ్మత్ అలీ, సల్మాన్ అహ్మద్, ఆదిలాబాద్ కు చెందిన రాథోడ్ రాహుల్ లను  అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

ఆర్మూరు నగర శివారులో గల నిర్మానుష్య వెంచర్ నందు గంజాయిని అమ్మడానికి తెస్తున్నారని సమాచారం మేరకు అట్టి ప్రదేశానికి వెళ్లి వారిని పట్టుకుని విచారించగా, గంజాయిని తలా కొంత పంచుకోవడానికి ఇక్కడికి వచ్చామని నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు.  అంతేగాక ఇట్టి నలుగురిలో ఇద్దరు గతంలో కూడా గంజాయి కేసులో పట్టుబడి జైలుకు వెళ్ళినారు. ఇట్టి సమయంలో నేరస్తుల వద్ద నుండి ఒక కిలో 70 గ్రాముల గంజాయి, వారి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు వివరించారు.