26 August, 2026 | 7:41 PM

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

26-08-2026 07:10 PM

కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఎసన్వాయి, సర్వాయిపేట గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇరు గ్రామాల సర్పంచ్‌లు మరుపాక రజిత సుఖేందర్, గుగ్లోత్ రాజేష్ నాయక్ లు అర్హులైన లబ్ధిదారులకు బుధ వారం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్మార్ట్ కార్డులతో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలను గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రేషన్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయమని పేర్కొన్నారు.