అనారోగ్య బాధితులకు పరామర్శ
19-09-2025 02:39 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో పలు మండలాల్లోని వ్యక్తులు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో నిమ్స్ ,యశోద ఆసుపత్రిలో, చికిత్స చేసుకుంటున్న బాధితులను శుక్రవారం బి ఆర్ ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ పరామర్శించారు. ఖానాపూర్ మండల కేంద్రంలోని న్యాయవాది నరేంద్రనాథ్, హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. దాంతోపాటు యశోద ఆసుపత్రిలో పెంబి మండలం పసుపుల గ్రామానికి చెందిన భూక్య భీమ్ సింగ్ చికిత్స పొందుతుండగా వారిని కలిసి మనోధైర్యం ఇచ్చి మంచి వైద్యం అందించాలని వైద్యులను కోరారు.




