17 April, 2026 | 5:19 AM

భూమ్ భూమ్..

31-05-2025 12:00 AM

‘అర్జున్ అంబటి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఎస్‌ఎస్ మీడియా బ్యానర్‌పై గుడిమిట్ల శివప్రసాద్ నిర్మిస్తున్నారు. నాగశివ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.

జూలై 11న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘భూమ్ భూమ్’ అంటూ సాగే ఈ పెప్పీ మాస్ నెంబర్‌ను డేవ్ జాండ్ కంపోజ్ చేయగా, గీతా మాధురి ఆలపించారు. రాంబాబు గోశాల సాహిత్యం అందించారు.