calender_icon.png 8 June, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హారర్ థ్రిల్లర్ పోలీస్ కంప్లుంట్

31-05-2025 12:00:00 AM

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైన నటి వరలక్ష్మి శరత్‌కుమార్. ఆమె తాజాగా తెలుగులో ‘పోలీస్ కంప్లుంట్’ మూవీ చేస్తోంది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తోపాటు, తొలిసారి ఆద్యంతం వినోదాన్ని కలిగించే పాత్రలో వరలక్ష్మి నటించడం విశేషం. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ మీద స్పెషల్ సాంగ్ షూట్ చేశామని, అది సినిమాకే మెయిన్ హైలెట్ అని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు.

అందుకే శుక్రవారం సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్రంలోని వరలక్ష్మి శరత్‌కుమార్ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని ఎమ్మెస్‌కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీవిష్ణు గ్లోబల్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ నిర్మాతలు. అఘోర, ఆప్త, పౌరుషం, రాఘవరెడ్డి, ఆదిపర్వం వంటి వినూత్న చిత్రాలను రూపొందించిన దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ సినమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

నవీన్‌చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, అమిత్, దిల్ రమేశ్, రాజశ్రీ నాయర్, సింగపూర్ బాలకృష్ణ, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీహర్ష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది” అని చెప్పారు.