సముద్రంలో బోటు బోల్తా.. 9మంది మత్స్యకారులు సేఫ్!

21-09-2026 | 11:59am

కోనసీమ జిల్లాలో మత్స్యకారుల బోటుకు ప్రమాదం

కోనసీమ జిల్లాలోని భైరవపాలెం మొగ వద్ద మత్స్యకారుల బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది.భైరవపాలెం గ్రామానికి చెందిన చింత శ్రీనుకు చెందిన బోటుపై తొమ్మిది మంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. తెల్లవారుజామున సముద్రంలో గాలి వేగంగా వీయడంతో బోటు అదుపుతప్పి మునిగిపోయినట్లు సమాచారం.అదే సమయంలో సమీపంలో ఉన్న మరో బోటు సిబ్బంది స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. తొమ్మిది మంది మత్స్యకారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.దీంతో పెను ప్రమాదం తప్పింది.

మరిన్ని వార్తలు