28 March, 2026 | 10:16 AM

ద్విదశాబ్ది పూర్వ విద్యార్థుల సమ్మేళనం

01-12-2025 12:49 AM

మహబూబాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం (వి) జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఆదివారం 2003 2004 బ్యాచ్ ఎస్‌ఎస్సి విద్యార్థులు ద్వి దశాబ్ది సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. చదువు నేర్పిన ఆనాటి గురువులను ఘనంగా సత్కరించారు. తాము ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధి అంశాలపై చర్చించుకున్నారు. పరస్పరం కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాగే తరచుగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.