12 March, 2026 | 10:29 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ఆ తండా సర్పంచ్‌కు 23 ఏళ్లే

01-12-2025 12:48 AM

అతి చిన్న వయసులోనే ఏకగ్రీవంగా ఎన్నిక

మహబూబాబాద్ జిల్లా పాత తండా ప్రథమ పౌరుడిగా ఇస్లావత్ నరేష్ 

మహబూబాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పెను గుర్తి మండలం పాత తండాకు చెందిన ఇస్లావత్ నరేష్ 23 ఏళ్ల వయసులోనే (అవివా హితుడు) సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అతి చిన్న వయసులోనే రాజకీ యాల్లోకి రావడమే కాకుండా ఏకంగా ఏకగ్రీవ సర్పంచిగా ఎన్నికవడంతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు.

శనివారం గ్రామ సర్పంచ్ పదవికి, 8 వార్డు సభ్యుల పదవులకు నామినేషన్ల గడువు ముగిసిపోయింది. గ్రామంలోని 8 వార్డులు, సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో నరేష్ సర్పంచుగా ఎన్నికయ్యాడు. నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 3 వరకు ఉండటంతో ప్రకటించడమే తరువాయిగా మిగిలింది.

కొత్తగా గత టర్మ్‌లో పంచాయతీగా ఏర్పడ్డ పాత తండా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు సొంత ఖర్చులతో దుర్గమ్మ దేవాలయ ప్రహరీ నిర్మాణం, ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణం, గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలను చేపట్టడానికి నూతన సర్పంచుగా బాధ్యతలు చేపట్టే నరేష్ నిర్ణయించినట్లు చెప్పాడు. యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహిస్తున్న నరేష్ చిరుప్రాయంలోనే గ్రామ ప్రథమ పౌరుడిగా ఏకగ్రీవంగా ఎంపిక అవ్వడం మహబూబాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా మారింది.