నేడే "బిగ్‌బాస్" విజేత అనౌన్స్ మెంట్.. 300 మందితో భారీ బందోబస్తు
హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రముఖ తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ముగియనుంది. బిగ్ బాస్ ఫైనల్ విజేత ప్రకటించే సమయం అసన్నమైంది. ఎంటర్ టైన్ మెంట్, ఫన్, టర్న్ లు, ట్వీస్ట్ లకు ఎలాంటి కొద్దువలేదంటూ మొదలైన ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా తాజా విడుదలైంది. గతేడాది బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఈ ఏడాది 300 మందితో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
అభిమానుల అత్యుత్సాహంతో గతేడాది అదుపు తప్పిన పరిస్థితులు ఈ ఏడాది రిఫిట్ కాకుండా పోలీసులు జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో బారికేట్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. బిగ్ బాస్ అభిమానులు స్టూడియోకు రావొద్దని పోలీసులు సూచించారు. ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ హెచ్చరించారు. ఇందిరానగర్, కృష్ణానగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియోకు వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లు వెస్ట్ జోన్ డీసీపీ పర్యవేక్షించారు. ఎంలాంటి అవాంఛనీయ ఘటన జరిగిన బిగ్ బాస్ నిర్వాహకులదే బాధ్యతని పోలీసులు హెచ్చరించారు.






