10 July, 2026 | 1:44 AM

లావ‌ణ్య త్రిపాఠి కొత్త చిత్రం ‘సతీ లీలావతి’

15-12-2024 02:58 PM

భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌ఎంఎస్, త‌దిత‌ర విభిన్న‌ చిత్రాల ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య దర్శకత్వంలో హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం సతీ లీలావతి. వైవిధ్య‌మైన ప్రాత‌ల‌తో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఆదివారం నాడు పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం సతీ లీలావతి టైటిల్ ను ప్రకటిస్తూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణ సారథ్యంలో ఈ సిన్మా  తెరకెక్కనుంది. మ‌రోసారి ప్రేక్షకులను మెప్పించ‌టానికి సిద్దమైన లావ‌ణ్య త్రిపాఠి సతీ లీలావతి చిత్రాన్ని నాగమోహ‌న్ బాబు, ఎమ్‌ రాజేష్‌.టి నిర్మించ‌నున్నారు. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే షూటింగ్ మొదలుకానుంది.