calender_icon.png 6 October, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడువులోగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

06-10-2025 12:42:12 AM

-1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం

-ఈవీఎం బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల కలర్ ఫొటోలు

-నవంబర్ 22లోగా ఎన్నికలు పూర్తి చేస్తామని సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ వెల్లడి

పాట్నా, అక్టోబర్ 5( విజయక్రాంత్రి) : గడువులోగా బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేస్తామని కేంద్ర ఎన్నికల సం ఘం పేర్కొంది. నవంబర్ 22వ తేదీలోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు పక డ్బందీ ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే  బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి రా ష్ట్రంలో పర్యటించిన ముఖ్య ఎన్నికల అధికారి పాట్నాలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గరిష్టంగా 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలనేది త్వరలో నిర్ణ యం తీసుకుంటామని తెలిపారు.

అయి తే,  ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఉంచనున్నామని తెలిపారు. తద్వారా అభ్యర్థులను ఓటర్లు తేలికగా గుర్తుపట్టేందుకు వీలుంటుందని, సీరియల్ నంబర్ కూడా పెద్దగా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎస్‌ఐఆర్ ద్వా రా అనర్హులను జాబితా నుంచి తొలగించామని, దీనిని బీహార్ ఓటర్లు స్వా గతించాలని చెప్పారు.