13 August, 2026 | 1:40 PM

పంటపోలాల్లో పసికందు మృతదేహం

13-08-2026 12:34 PM

పొలం దున్నుతుండగా రైతుకు కనిపించిన నవజాతి శిశువు మృతదేహం..

అధికారులకు, స్థానికులకు సమాచారం ఇచ్చిన రైతు..

సుమారు 5 నుంచి 6నెలల ప్రెగ్నేన్సీ అబార్షన్ చేసినట్లు అనుమానం..

పసికందును చూసేందుకు వస్తున్న జనం..

కూసుమంచి, (విజయక్రాంతి): మానవత్వం మంటగలుస్తోంది.. బిడ్డలను కనాల్సిన తల్లులు.. బిడ్డలను చెత్తకుప్పలో పారేసే స్థితికి చేరింది పాడు కాలం.‌.   పసికందును పంటపొలాల్లో పడేసిన మానవీయ ఘటన కూసుమంచి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలోని శివాలయం రోడ్డులో ఓ రైతు 

పొలం దున్నుతుండగా నవజాతి శిశువు మృతదేహం కనిపించింది. ఆయన వెంటనే అధికారులకు, స్థానికులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న ఎస్ఐ నాగరాజు, మరో ఎస్ఐ దివ్య,  మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయికుమార్, వైద్య సిబ్బంది హాటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని నవజాతి శిశువు మృతదేహాన్ని పరిశీలించారు.  సుమారు 5 నుంచి 6నెలల ప్రెగ్నేన్సీ అబార్షన్ చేసినట్లు వైద్యులు, పోలీసులు  అనుమానిస్తున్నారు. పసికందు మృతదేహాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకించి బాధపడుతున్నారు... పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు