కలెక్టర్లు ఏసీరూముల్లోంచి బయటకెళ్లడం లేదు
- గతంలో అధికారులు నిత్యం ప్రజల మధ్యే ఉండేవారు
- ప్రజలు లీడర్ల కంటే అధికారులనే ఎక్కువగా గుర్తుంచుకునేవారు
- ఎస్‌ఆర్ శంకరన్, టీఎన్ శేషన్, మన్మోహన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
- ‘లైఫ్ ఆఫ్ కర్మయోగి’ పుస్తకం ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 16 ( విజయక్రాంతి): “ఐఏఎస్ అధికారులు గతంలో నిత్యం ప్రజల్లో ఉండేవారు.. రాజకీయ నాయకుల కంటే అధికారులనే ప్రజలు ఎక్కువగా గుర్తుంచుకునేవారు. కానీ ఇప్పుడు కలెక్టర్లు ఏసీ రూముల్లోంచి బయటకు వెళ్లడం లేదు. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావా లి.. పేదలకు సాయం చేయాలన్న ఆలోచన ఉండాలి.
అలాంటివారే ప్రజల మనసులో ఎక్కువ కాలం ఉంటారు.. నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎమ్ గోపాలకృష్ణ రచించిన ‘ లైఫ్ ఆఫ్ కర్మయోగి’ అనే పుస్తకాన్ని సీఎం ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల తన అనుభవాన్ని ఈ పుస్తకంలో గోపాలకృష్ణ నిక్షిప్తం చేశారని, ఇది ఒక పెద్ద టాస్క్ అని అన్నా రు. సమాజంలో ఏదైనా కొనవచ్చని, అనుభవాన్ని మాత్రం కొనలే మని, సివిల్ సర్వెం ట్స్ అందరికీ ఈ పుస్తకం దిక్సూచిగా ఉం టుందన్నా రు.
ముగ్గురు సివిల్ సర్వెంట్లను మ నం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని, వారు ఎస్‌ఆర్ శంకరన్, టీఎ న్ శేషన్, మన్మోహన్‌సింగ్ అని చెప్పారు. ఎస్‌ఆర్ శంకరన్ నిబద్ధతతో పనిచేసిన గొప్ప అధికారని, పారదర్శకంగా ఎన్నికల నిర్వ హణకు ఎంతో కృషి చేసిన గొప్పవ్యక్తి శేషన్ అని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి అంటూ పేర్కొన్నారు.
రాజ కీయ నిర్ణయాలపై నాయకులకు అధికారులు విశ్లేషణ చేసి చెప్పాలని సూ చించా రు. ఆ దిశగా రాష్టంలోని అధికారులు దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.




