10 August, 2026 | 12:47 PM

మరకత లింగ సోమేశ్వర స్వామిని దర్శించుకున్న బీర్ల అయిలయ్య

10-08-2026 11:42 AM

ఆలేరు, ఆగస్టు 10 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సమేతంగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం చందిప్పలోని శ్రీ మరకత లింగ సోమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఆలయ అర్చకులు, నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.