10 August, 2026 | 12:46 PM

విద్యుత్‌ షాక్‌తో కాంట్రాక్టు కార్మికుడు మృతి

10-08-2026 11:41 AM

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

పెంచికల్‌పేట్‌(విజయ క్రాంతి): విద్యుత్‌ పనులు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన పెంచికల్‌పేట్‌ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని గొంట్లపేట–మొట్లగూడ బస్టాండ్‌ సమీపంలో విద్యుత్‌ పనులు చేస్తుండగా బొంబాయిగూడ గ్రామానికి చెందిన నాగపురి చందు విద్యుత్‌ షాక్‌ తగిలి కిందపడిపోయాడు.తీవ్రంగా గాయపడిన చందును స్థానికులు వెంటనే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.విషయం తెలుసుకున్న సిర్పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి కుటుంబానికి అందాల్సిన ప్రయోజనాలను త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.