10 August, 2026 | 1:31 PM

ప్రియాంక ఘటన అత్యంత దురదృష్టకరం: మంత్రి వాకిటి శ్రీహరి

10-08-2026 12:25 PM

హైదరాబాద్: మంత్రి వాకిటిశ్రీహరి(Minister Vakiti Srihari), మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ గాంధీ ఆస్పత్రిలోని(Gandhi Hospital) మార్చురీలో మెడికో విద్యార్థి ప్రియాంక(Medico Student Priyanka) భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ప్రియాంక తండ్రిని మంత్రి వాకిటి శ్రీహరి ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రియాంక ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రియాంక మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తమకు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరుగకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని తప్పించుకోకుండా కఠినతరం చేయాలన్నారు. గాంధీ ఆస్పత్రిలో ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయిందని వైద్యులు తెలిపారు. ప్రియాంక మృతదేహాన్ని గద్వాల జిల్లా ఐజాకు తరలించారు.