10 August, 2026 | 12:53 PM

వార్డుల వారీగా సమస్యలపై ఆరా

10-08-2026 11:45 AM

ప్రజల వద్దకే వెళ్లి వివరాలు తెలుసుకున్న సర్పంచ్‌ బొజ్జ గీతారెడ్డి

అచ్చంపేట, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సర్పంచ్‌ బొజ్జ గీతారెడ్డి వార్డులవారీగా పర్యటించారు. గ్రామంలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ ప్రజలను కలుసుకుని తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధిలైట్లు తదితర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి వార్డులోని సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచ్‌ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని కోరారు. పర్యటనలో ప్రవాసి ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్‌ బొజ్జ అమరేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌చారి, వార్డు సభ్యులు వెంకటయ్య, లక్ష్మి, భారతమ్మ, పర్వతాలు, సువర్ణ, రేనమ్మ, గ్రామ పెద్దలు ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, తోళ్ల రాజు, రమేష్‌గౌడ్‌, పానుగంటి పర్వతాలు, శేఖర్‌గౌడ్‌, గ్రామ యువకులు పానుగంటి శేఖర్‌, రేనయ్య, నందు, కుమ్మరి శివ, శ్రీనుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.