10 August, 2026 | 1:28 PM

పార్లమెంట్ ముందు విపక్షాల నిరసన

10-08-2026 12:18 PM

న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) లోక్ సభలో సమాధానం చెప్పాలని పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఎంపీలు(INDIA bloc MPs) నిరసన చేస్తున్నారు. అమిత్ షా సభకు హాజరు కానీ తేదీలతో కూడిన ప్లకార్డులను కూటమి ఎంపీలు ప్రదర్శించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఎంపీల నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Reddy) మాట్లాడుతూ.... పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయని సూచించారు.

అమిత్ షా హౌస్ లోకి రావడం లేదన్న చామల కిరణ్ విపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. కేంద్రం తనకు కావాల్సిన బిల్లులను పాస్ చేయించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. అమిత్ షా లోక్ సభకు వచ్చి విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జ్ పై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ పేల్చమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో అమిత్ షా సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం బిల్లులపై పార్లమెంట్ లో చర్చ పెడితే ఆ బిల్లుల ఆమోదానికి సంబంధించి ప్రతిపక్షాలుగా నిర్ణయం తీసుకుంటామని సూచించారు. కేంద్రం ప్రజాస్వామ్య బద్దంగా పార్లమెంట్ ను నడపాలని చామల కిరణ్ కుమార్ స్పష్టం చేశారు.