మన రాజ్యాంగమే అన్నింటికీ దిక్సూచి
అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్న వక్తలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు
ఆదిలాబాద్, ఏప్రిల్ ౧౪ (విజయక్రాంతి): బడుగుల అభివృద్ధి ప్రధాత, భారత రాజ్యాం గ నిర్మాత, డా.బిఆర్.అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. మంగళవా రం ఆదిలాబాద్‌లో అధికారికంగా నిర్వహించిన డా.బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమానికి స్థానిక ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూ షలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా ఎస్సీ కార్పొరేషన్ కార్యా లయ ఆవరణంలో జరిగిన జయంతి వేడుకల్లో అతిథులు పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుండి అంబేద్కర్ చౌక్ లో జరిగిన కార్యక్రమంలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి బుద్ద వందన గావించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆరైవ్-అలైవ్ రోడ్డు భద్రత పోస్టరలను ఆవిష్కరించి, రోడ్డు భద్రతకై ప్రతిజ్ఞ చేశారు.
అదేవిధంగా ప్రాణాదాత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, స్టాంపులతో రూపొందిస్తున్న అంబేద్కర్ చిత్రపటంపై కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు జైభీమ్ స్టాంప్ ను వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసి న సంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లా ప్రజలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న వాక్ స్వాతంత్య్రం, సమానత్వం కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమయ్యాయని కొనియాడారు.
దేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ అందరూ శాంతియుతంగా కలిసి ఉండడానికి రాజ్యాంగమే దిక్సూచి అని సూచించారు. యువతకు కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ వృత్తులే కాకుం డా డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇందులో భాగంగా 10 పాఠశాలల్లో ’లెర్న్ స్మార్ట్ విత్ AI’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సంక్షేమ రంగంలో భాగంగా ఎస్సీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, ఆరో వాటర్ ప్లాంట్లు, గీజర్ల ఏర్పాటు వంటి పనులు పూర్తి చేశామని వివరించారు.
అలాగే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం మూడు ’యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించడంలో ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నిజాయితీతో కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ... అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్పూర్తి వల్లే నేడు భారతదేశం ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకుందని కొనియాడారు.
దళిత జాతి అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారి, బిసి సంక్షేమ అధికారి సోని యా, ఆర్డీఓ స్రవంతి, ఈడి మనోహర్, రవా ణా శాఖ అధికారులు రవీందర్, శ్రీనివాస్, హరింద్ర, కౌన్సిలర్లు, కుల సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి
బోథ్: అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉం దని శాసనసభ్యులు జాదవ్ అనిల్ పేర్కొన్నా రు. మంగళవారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మం డలంలోని పోచ్చర గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ కలల సహకారం చేసే దిశగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు, దళిత బస్తీ పథకాలను అమలు చేశారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం అప్పటి ముఖ్యమంత్రి కృషి చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుడాల స్వామి, మాజీ జడ్పిటిసి సంధ్యారాణి, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తి దాత అంబేద్కర్
నిర్మల్: రాజ్యాంగ స్ఫూర్తిదాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ఇందిర మ్మ ప్రజాపాలన ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సహ భక్తి భోజనాలను చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఏ ఇంద్రకన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణి చక్రవర్తి, గ్రంథాలయ చైర్మ న్ అర్జున్ మన్ అలీ, నాయకులు కృష్ణవేణి సమరసింహారెడ్డి నాందేడ్ చిన్ను ఎమ్మరి రాజేశ్వర్, గాజుల రవికుమార్, సత్యనారాయణ, ధర్మాజీ రాజేందర్ తదితరులు ఉన్నారు.
రాజ్యాంగ హక్కుల్ని పొందాలి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్య దేశంలో పౌరుల కోసం రూపొందించబడిన రాజ్యాంగ హక్కుల్ని ప్రతి ఒక్కరు పొందాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ ట్యాంక్ కూడా వద్ద అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో విలువందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్ప ల గణేష్ చక్రవర్తి, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి దయానంద్ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు
అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేద్దాం
బైంసా: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వివిధ పార్టీల, సంఘాల నాయకులు అన్నారు. బైంసాలో మంగళవా రం డాక్టర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రాంతీయాసుపత్రి ముందున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బైంసా మున్సిపల్ చైర్మన్ తూమల దత్తాత్రి,, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి మోహన్ రావు పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ చంద్ర, బీఆర్‌ఎస్ నాయకుడు విలాస్ గాదేవా, దళిత సంఘాల నాయకులు ఏం సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
సమిష్టి కృషి అవసరం
కుమ్రం భీం ఆసిఫాబాద్: అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం భారత రాజ్యాంగ రూపకర్త డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ లో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు.
యువత విద్యపై దృష్టి పెట్టి దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందా యని తెలిపారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ అంబేద్కర్ సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం కోసం కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జీవితాలపై నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.
అనంతరం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్, మున్సిపల్ చైర్పర్సన్ మెంగ్రే, వైస్ చైర్పర్సన్ ఎండి. అహ్మద్, అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మహానీయుడు అంబేద్కర్
ఉట్నూర్: అణగారినా వర్గాల అభివృద్ధికి అశేష కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను మండలం కేంద్రంలోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ శాఖ కార్యాలయ ఆవరణలో మంగళవారం నిర్వహించారు. ప్రాజెక్టు అధికారి తో పాటు వివిధ శాఖల సిబ్బంది పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో ఏపీఓపి విటిజి ఆత్రం భాస్కర్, పరిపాలన అధికారి దామోదర్ స్వామి, మేనేజర్ శ్యామల దేవి, కార్యాలయ వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిదంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మండల బిఆర్ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్, దళిత నాయకులు వాగ్మరే భారత్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, దళిత సంఘాల నాయకులు శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్ర మండల కేంద్రంలోని వడగావ్ రోడ్డు వరకు కొనసాగింది. అనంతరం మండల కేంద్రంలోని బుద్ధ భవన్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ స్థలానికి చేరుకున్నారు.
శోభాయాత్రలో వరంగల్, కరీంన గర్, జగిత్యాల, హైదరాబాద్ నుండి దళిత సంఘాల నాయకులు, దళితులు పెద్ద సం ఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నుండి వచ్చిన మహిళా కళాకారులు డప్పులు కొట్టు తూ స్టెప్పులు వేయగా, ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల నుండి హాజరైన దళితులు మహిళా కళాకారులు డప్పు చప్పుడుకు దళిత మహిళలు సైతం ప్రత్యేక నృత్యాలు చేశారు. భారీ శోభాయాత్ర సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్, ఎస్సై సాయన్న పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.






