15 April, 2026 | 3:16 AM

దడపుట్టిస్తున్న ఎండలు

15-04-2026 12:00 AM

ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

నిర్మానుష్యంగా రోడ్లు..

ఆదిలాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో జిల్లాలోనూ ఎం డలు మండిపోతున్నాయి. రెండు రోజులుగా 43 డిగ్రీలకు పైబడి పగటి ఉష్ణోగ్రతలతో ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నానికి 42, 43 డిగ్రీలకు చేరుకోవడం ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.

మంగళవారం మద్యాహ్నం అత్యధికంగా 42.8 డిగ్రీలు నమోదుకాగా మావలలో 42.6 డిగ్రీలు, తాంసి మండలం అర్లి(టి)లో 42.5. తలమడుగులో 42.4. ఇచ్చోడలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి భగభగలకు వేడిగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం పది గంటల నుంచే ఎండవేడిమి ప్రభావం మొదలు కావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.

అత్యవసర సమయాల్లో బయటకు వచ్చే వారు ఎండల నుండి రక్షణకు టవల్స్, గొడుగుల రక్షణలో బయటకు వస్తున్నారు. ఎప్పడు వాహనాలు, ప్రజలతో రద్దీగా ఉండే రోడ్లన్నీ ఎండవేడిమి కారణంగా పగటిపూట నిర్మాణుశ్యంగా మారి కర్పూను తల పిస్తున్నాయి. ఇండ్లలో కూలర్లు, ఎసీల వినియోగం పెరిగిపోవడంతో విద్యుత్ విని యో గం కూడా పెరిగింది. మరో మూడు, నాలుగు రోజులు పగటి ఉష్ణోగ్రతల ప్రభావం ఇలానే ఉంటుందని, ఎండల నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.