calender_icon.png 28 September, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాడ వాడల 'వట్టె జానయ్య యాదవ్' జన్మదిన వేడుకలు

28-09-2025 07:46:29 PM

పెన్ పహాడ్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ ఉద్యమ నేత వట్టె జానయ్య యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆ పార్టీ జిల్లా నాయకులు ఆవుల అంజయ్య యాదవ్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాణసంచా కాల్చి, భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆవుల అంజయ్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాదీపం పేదల పెన్నిధి జానయ్య యాదవ్ మరెన్నో ఉన్నత పదవులు చేపడుతూ ప్రజాసేవలో ముందుకు వెళ్లాలని, నిండు నూరేళ్లు ఇలాంటి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యల్లావుల కోటేష్, గడ్డం శంకర్, జాల నాగరాజు, సందీప్, కిషన్, రమేష్, శ్రీకాంత్, గోపి, హనుమయ్య, నాగయ్య, రాము, గడ్డం వెంకటేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.