28-09-2025 07:56:43 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కి బాత్ 126వ ఎపిసోడ్ పశ్చిమ జోన్ 17వ డివిజన్ 362వ బూత్ కేంద్రంలో కార్యక్రమాన్ని బిజెపి పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి, నాయకులు నరహరి లక్ష్మారెడ్డి, ఖచ్చు మధు, బొంగోని పరశురాములు, భూత్ అధ్యక్షులు శీతల రమేష్ చంద్ర, బండ రాకేష్, చంద్రగిరి వేణు, ఈరెడ్డి తిరుమల్ రెడ్డి, ఆబిడి మాధవరెడ్డి వీక్షించారు. తదుపరి 362 బూత్ కేంద్రంలో సర్దార్ భగత్ సింగ్ 128వ జయంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ లాలా లజపతిరాయ్ మృతికి కారకుడైన బ్రిటిష్ అధికారి సాండర్స్ ను చంపిన కేసులో భగత్ సింగ్ కు బ్రిటిష్ ప్రభుత్వం ఉరి శిక్ష విధించింది, అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ, మళ్లీ జన్మంటూ ఉంటే భారతదేశంలో జన్మించాలని కోరుకున్న ధీరుడు భగత్ సింగ్ అని బిజెపి నాయకులు జాడి బాల్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి కొనియాడారు.