28-09-2025 07:43:44 PM
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం
నస్పూర్ (విజయక్రాంతి): రాష్ట్రంలో పటేల్ ఎంటర్ప్రైన్యూర్స్ నెట్వర్క్(పెన్) మున్నూరు కాపుల సమైఖ్యతకు కృషి చేస్తుందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని ప్రెస్ క్లబ్ లో పెన్ కో ఆర్డినేటర్ లేదాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో పటేల్ మున్నూరు కాపుల పరిచయం, పెన్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా పటేల్ ఎంటర్ప్రైన్యూర్స్ నెట్వర్క్(పెన్) సంస్థను డాక్టర్ పీఎల్ఎన్ సలాడీ పటేల్, వెంకటేశ్వర్రావు, బేతి శ్రీధర్, ఆకుల శ్రీనివాస్, సదానందం టీం స్థాపించారని, ఇందులో 25 లక్షల మంది సబ్యులుగా ఉన్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న పటేల్ మున్నూరు కాపులను ఒక వేదిక పైకి తీసుకచ్చి సామాజిక అభివృద్ధికి, మున్నూరు కాపులను అన్ని రంగాల్లో రానించే విధంగా పెన్ కృషి చేస్తుందన్నారు.
ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేయూతనందించుకోవాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా పెన్ విస్తరించి ఉందన్నారు. డిసెంబర్ లో హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సెమీనార్ (వర్క్ షాప్) నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వర్క్ షాప్ లో అన్ని రంగాల పారిశ్రామిక వెత్తలు, మేదావులు, విధ్యావంతులు హాజరవుతారని చెప్పారు. పటేల్ మున్నూరు కాపులు సామాజికంగా, విధ్యా, వైద్యం, పారిశ్రామిక రంగం, రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ఈ వర్కషాప్ దిశా దశ నిర్దేశిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెన్ వాలంటరీ సబ్యులు సాధినేని రమేష్ పటేల్, కాశెట్టి సుధాకర్ పటేల్, ఐండ్ల అభినవ్ పటేల్, శేఖర్ పటేల్, సాతిని అన్వేష్ పటేల్, పెంచాల వేణు పటేల్, భాస్కర్ల రాజేశం పటేల్, సత్యం పటేల్, గుమ్మడి తిరుపతి పటేల్, బోరిగం వెంకటేశ్ పటేల్, నెమిలికొండ కుమార్ పటేల్, మెక్కొండ రవీందర్, శ్రీపతి సదయ్య పాల్గొన్నారు.