బీజేపీ, బీఆర్‌ఎస్ పేదలకు చేసిందేమీ లేదు
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం, మే 10 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డితో కలిసి శుక్రవారం కొత్తగూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలను నట్టేట ముంచాయని విమర్శించారు.
పేద, మధ్య తరగతి వర్గాలకు ఆ రెండు పార్టీలు చేసిందేమీ లేదన్నారు. రఘురాం రెడ్డిని గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా, కాంగ్రెస్, సీపీఐ నాయకులు ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, ఎల్ గోపాలకృష్ణ, సత్యనారాయణ, నేరేళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డీసీఎంఎస్ చైర్మన్ ఆధ్వర్యంలో..
రఘురాం రెడ్డికి మద్దతుగా డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస రావు సీపీఐ, సీపీఎం నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు.






