26 April, 2026 | 12:15 PM

రేవంత్‌రెడ్డి చంద్రబాబు మనిషే

11-05-2024 01:58 AM

తెలంగాణ సీఎంపై ఏపీ సీఎం విమర్శలు

హైదరాబాద్, మే 10: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు మనిషేనని ఆరోపించారు. ఏపీలోని కడప జిల్లాలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా చంద్రబాబు మనిషే. చంద్రబాబు పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్‌తో కాపురం చేస్తారు ఇప్పుడు చంద్రబాబును గెలిపించేందుకు కాంగ్రెస్ పనిచేస్తున్నది’ అని విమర్శించారు.