సీఎం రేవంత్‌రెడ్డికి ఈసీ నోటీసులు
11-05-2024 02:06 AM
కేసీఆర్‌ను అసభ్యపదజాలంతో దూషించారని బీఆర్‌ఎస్ ఫిర్యాదు
48 గంటల్లో వివరణ ఇవ్వాలని సూచన
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి) : ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ నోటీసులు జారీ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషించారని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిం చారని బీఆర్‌ఎస్ నాయకులు నుంచి అందిన ఫిర్యాదు నేపథ్యంలో సీఈవో ఈ చర్యలు తీసుకున్నారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జీ. నిరంజన్‌ను కోరారు. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వకుంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఈవో స్పష్టం చేశారు.






