23 April, 2026 | 2:27 AM

కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు

23-04-2026 01:25 AM

నిజాంసాగర్ ఏప్రిల్ 22( విజయ క్రాంతి ) కామారెడ్డి జిల్లా మహబూబ్నగర్ మండలంలోని బూర్గులు గ్రామానికి చెందిన బీ ఆర్‌ఎస్, బిజెపి కార్యకర్తలు  బుధవారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి స్థానిక శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై  కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సర్పంచులు గజ్జల జీవన్, గంగి రమేష్, హరిన్, నాయకులు నాగభూషణం గౌడ్, సవైసింగ్ తదితరులు పాల్గొన్నారు.