11 May, 2026 | 1:33 AM

చేవెళ్ల నుంచి మోదీ సభకు తరలిన బీజేపీ శ్రేణులు

11-05-2026 12:28 AM

వాహనాలకు జండా ఊపి ప్రారంభించిన పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అనంతరెడ్డి

చేవెళ్ల, మే 10(విజయక్రాంతి): హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ బహిరంగ సభకు చేవెళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివెళ్లారు. ప్రత్యేక వాహనాల్లో ఉదయం నుంచే కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. చేవెళ్ల నుంచి బయలుదేరిన వాహనాలను పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అనంతరెడ్డి జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా.. మాట్లాడుతూ, దేశ అభివృద్ధి, పేదల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి చేరుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని, భవిష్యత్తులో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు మరింత ఆదరణ చూపుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సభ విజయవంతం కావడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. సభలో ప్రధాన  ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించారని ప్రకటనలో అనంత్ రెడ్డి పేర్కొన్నాడు.