సన్నిధిలో మాతృ దినోత్సవం
విద్యార్థులకు ఉచితంగా దుస్తుల పంపిణీ
విశ్రాంత తహసీల్దార్ దంపతుల ఉదారత
మహబూబ్ నగర్ టౌన్ మే 10: రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లోని ఏనుగొండ లో నిర్వహిస్తున్న సన్నిధి ఆశ్రమంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
మహబూబ్ నగర్ కు చెందిన విశ్రాంత తహసీల్దార్ పవన్ కుమార్, విజయ లక్ష్మీ దంపతులు అనాథ విద్యార్థులకు అండగా నిలువాలనే ఉద్దేశ్యంతో ఆదివారం రెడ్ క్రాస్ సన్నిధి ఆశ్రమంలో మాతృ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా వారు తమ సొంత ఖర్చుతో రూ 50 వేలతో 104 మంది విద్యార్థులకు ఉచితంగా దుస్తులను పంపిణి చేశారు. అంతే కాకుండా విద్యార్థులకు మూడు పూటలు టిఫిన్, భోజన సదుపాయం కల్పించడంతో పాటు మిఠాయిలు, పండ్లు, బిస్కెట్ లు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా విజయలక్ష్మీ పవన్ కుమార్ దంపతులు మాట్లాడుతూ విద్యార్థులు ఎవరూ అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. అనాథ పిల్లలకు తమ వంతు సహకారం, ప్రోత్సాహం ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ అంబటి నటరాజు, యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్తలు బాబుల్ రెడ్డి,లయన్ అశ్విని చంద్ర శేఖర్, కందుకూరి అశోక్ కుమార్, సన్నిధి ఆశ్రమ సూపరింటెండెంట్ వెంకటేశ్వరమ్మ, భావన, సిబ్బంది పాల్గొన్నారు.






