calender_icon.png 21 November, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటపల్లిలో బీజేపీ సంబరాలు

09-02-2025 03:49:19 PM

చెన్నూర్,(విజయక్రాంతి): చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో ఆదివారం బిజెపి నాయకులు సంబరాలు నిర్వహించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోటపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మంత్రి రామన్న, జిల్లా బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ దుర్గం అశోక్ లు మాట్లాడుతూ రానున్న కాలంలో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

నరేంద్ర మోడీ, అమిత్ షా, జెపి నడ్డ నాయకత్వంలో దేశంలో బీజేపీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నదనడానికి ఢిల్లీ గెలుపే ఒక నిదర్శనమన్నారు. స్థానిక సంస్థలలోను ఇదే ఊపు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు వడ్లకొండ రాజేష్,  మండల జనరల్ సెక్రెటరీ కందుల వెంకటేష్, గిరిజన మోర్చా అధ్యక్షులు కొడిపె మహేష్, బూత్ అధ్యక్షులు కాసెట్టి రాకేష్, మండల సీనియర్ నాయకులు దుర్గం నరసింహులు, సేగం చంద్రయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.