మహిళలను వంచించిన బీజేపీ
- కుట్ర పూరితంగా బిల్లులు ప్రవేశపెట్టారు
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలను వంచించిందని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితం అయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై కవిత స్పందించారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని స్పష్టమైన అవగా హన ఉన్నప్పటికీ బీజేపీ కుట్ర పూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చిం దన్నారు.
మహిళా కోటా బిల్లుతో డీలిమిటే షన్ బిల్లు ను ముడిపెట్టడంతో ప్రతిపక్షాలన్నీ వీగిపోయేలా చేశాయని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ ప్రయత్నం చేసిందని, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టీ పాస్ చేసి దానిని సెన్సెస్‌కు లింక్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు 2011 సెన్సెస్ అధారంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెడుతున్నట్టు చెప్పి మరోసారి వంచించిందన్నారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఆడబిడ్డలు బీజేపీ మోసాన్ని గుర్తించాలని, పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళ నాయకత్వం వహిస్తోందని, ఈ మోసకారి బీజేపీని ఓడించి ఆ మహిళను గెలిపించాలని బెంగాల్‌లో ఉన్న మీ స్నేహితులకు చెప్పాలని కవిత పిలుపునిచ్చారు.






