ఈడీ దాడులకు నిరసనగా బీజేపీ దిష్టిబొమ్మ దహనం
మేడ్చల్ అర్బన్, మే 28(విజయక్రాంతి): కేరళ రాష్ట్ర మాజి సీఎం విజయన్‌పై ఈడి దాడులకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో మేడ్చల్లో బిజెపి దిష్టిబొమ్మ దహనం చే శారు. బిజెపికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మండల సిపిఎం నాయకుడు నర్సింగ్ రావు మాట్లాడుతూ కేరళ రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పై ఎలాంటి కేసులు లేకుండా ఈడిని ఉపయోగించుకొని బిజేపి కేంద్ర ప్రభుత్వం దాడులు చేయించడం సరైన పద్ధతి కాదన్నారు.
కేంద్రం ప్రభు త్వ ఆధీనంలో పని చేస్తున్న ఈడి అధికారు లు సోదాల సందర్భంగ ఎలాంటి అవినీతి జరిగిందో చెప్పకుండానే చేతులు ముడుచుకొని వెళ్లడమనేది మాజి సిఎం విజయన్ యొక్క నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు యాదగిరి, దేవమ్మ, సంపూర్ణ, సత్యమని, బలమని, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.






